International

ఆస్ట్రేలియాలో స్వదేశీ రాకెట్ విఫలం – 14 సెకన్లలోనే పేలుడు

Australian-made Gilmour Space Technologies not giving up after rocket crash  - ABC News

ఆస్ట్రేలియాలో తొలిసారిగా దేశీయ సాంకేతికతతో తయారుచేసిన రాకెట్ ప్రయోగం దురదృష్టవశాత్తూ విఫలమైంది. క్వీన్స్లాండ్‌లోని బోవెన్ స్పేస్ పోర్ట్‌ నుంచి ప్రయోగించిన 23 మీటర్ల ఎరిస్ లాంచ్ వెహికల్ లిఫ్ట్ ఆఫ్ సమయంలో తంటాలు పడింది. ప్రయోగం ప్రారంభమైన 14 సెకన్ల వ్యవధిలోనే రాకెట్ కుప్పకూలిపోయి నేలపై తగలబడింది. తక్కువ సమయంలోనే మంటలు చెలరేగి దాని శిథిలాలను కవించారు.

ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ గిల్మౌర్ స్పేస్‌ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలతో ఉంది. తమ స్వంతంగా రూపొందించిన లిక్విడ్ ఫ్యూయెల్ సాంకేతికత ఆధారంగా ఈ రాకెట్‌ను తయారు చేశారు. ప్రాజెక్టు వెనుక ఐదేళ్ల కృషి ఉండగా, దీని విజయంతో ఆస్ట్రేలియా అంతరిక్ష రంగంలో కీలక అడుగు వేస్తుందని ఆశించారు. అయితే తొలిప్రయత్నం విఫలమైనా, ఇది ప్రయోగాల కోసం కీలక డేటాను అందించిందని సంస్థ అభిప్రాయపడుతోంది.

ఇది ప్రయోగ దశలోని ప్రారంభ అడుగుగా మైలురాయిగా నిలుస్తుందని గిల్మౌర్ సీఈఓ వ్యాఖ్యానించారు. “ఈ ఫలితం భావించిన విధంగా కాకపోయినా, మేము మా లక్ష్యానికి మరింత దగ్గరవుతున్నాం” అంటూ ఆయన వెల్లడించారు. రాకెట్ ప్రయోగ విఫలమైన సమయంలో తీసిన లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చాలా మంది దీనిపై చర్చిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version