Andhra Pradesh

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వం

Big Breaking : ఏపీలో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం | Free bus  travel for women in AP from August 15

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. వచ్చే ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

“రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది” అని మంత్రి వెల్లడించారు.

ఈ పథకం అమలులో భాగంగా 6,700 బస్సులను ప్రత్యేకంగా మహిళల ప్రయాణానికి కేటాయించామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,950 కోట్లు వెచ్చించనుంది అని వివరించారు.

స్త్రీల ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛా గమనం, సామాజిక సాధికారతకు ఈ పథకం పెద్ద ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version