Andhra Pradesh
ఆగస్టు 10 నాటికి రోజా జైలుకు వెళ్లక తప్పదు: శాప్ ఛైర్మన్ రవినాయుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధంగా ఉందని శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 10లోగా ఆమె జైలుకెళ్లక తప్పదన్నారు. స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న సమయంలో రోజా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నట్లు విచారణలో తేలుతోందని తెలిపారు. ఆమె రోజులు లెక్కపెట్టుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రోజా జైలుకు వెళ్లడం అనివార్యమని వ్యాఖ్యానించారు.