Business

అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్

Amidst Rising US Tariff Threats, India Halts Buying Six P-8I Surveillance  Aircraft, Reevaluating Other Major Defence Deals | Defence News India

అమెరికా నుంచి బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాలకు ప్రతిస్పందనగా, 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2021లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, భారత్ 6 P-81 జెట్లను 2.42 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ జెట్లు సముద్ర పహారా, సబ్మరైన్ హంటింగ్ వంటి కీలక రక్షణ కార్యకలాపాల్లో ఉపయోగపడతాయి.

అయితే, ఈ జెట్ల తయారీలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ముడి సరుకులు భారత్ నుంచే అమెరికాకు ఎగుమతి అవుతాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల కారణంగా, ఆ ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దాంతో జెట్ల తయారీ ఖర్చు కూడా పెరిగి, మొత్తం ఒప్పంద విలువ దాదాపు 50% పెరిగిపోయింది.

భారత రక్షణ శాఖ ఈ పరిస్థితిని సమీక్షించి, కొత్త ధరలతో డీల్ కొనసాగించడం లాభదాయకం కాదని తేల్చింది. అందువల్ల, అమెరికాతో ఉన్న ఈ పెద్ద రక్షణ కొనుగోలు ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిపుణుల ప్రకారం, ఇది భారత్-అమెరికా రక్షణ వ్యాపార సంబంధాలపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే అవకాశాలు ఇంకా ఉన్నాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version