Andhra Pradesh

అమలాపురంలోపేలుడుకలకలం..

డాక్టర్ బిఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీపేలుడు కలకలం రేపింది పట్టణంలోని రావులచెరువు ప్రాంతంలో ఓఇంట్లో పేలుడు దెబ్బకు ఇల్లునేల మట్టమైంది ఈఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వెంటనే వారందరిని స్థానికులు పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు వీరిలో ఒకరి పరిస్థితివిషమంగా ఉండటంతోమెరుగైన వైద్యం నిమిత్తంకిమ్స్ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈపేలుడు గ్యాస్ సిలిండర్ల వల్ల  జరిగిందని ముందు ప్రచారం జరగ్గాస్థానికులు మాత్రం బాణా సంచా వల్ల జరిగిందని చెబుతున్నారు.

దీపావళి పండగ కోసం జనావాసాల మధ్య రహస్యంగా బాణాసంచా తయారు చేస్తుండగా నే ఈఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదం దెబ్బకు రెండతస్తుల భవనం భారీశబ్ధంతో కుప్పకూలిపోవడం తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రమాదానికి సంబంధించి  అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తులఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు పేలుడు మందుగుండు సామాగ్రి వల్లే జరిగిందా అని ఆయన్ని అడగ్గా అవన్నీ విచారణలో తేలుతామని సరైన సమాచారం లేకుండా దాని పైవ్యాఖ్యానించడం సరికాదన్నారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమలాపురం పట్టణం ఈపేలుడు తో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version