National
అకౌంట్లో పంట బీమా డబ్బులు వచ్చాయా?
పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం నిన్న రూ.3,900 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే, ముందుగా pmfby.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
అక్కడ ఉన్న Farmer Corner ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తరువాత మీ మొబైల్‌కి వచ్చే OTPని ఎంటర్ చేసి Application Status పై క్లిక్ చేయాలి.
అంతే కాకుండా, మీ పాలసీ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇచ్చినా కూడా డబ్బులు జమ అయ్యాయా లేదా అనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.