Sports

స్మృతీ మంథాన తాజా వీడియోపై హాట్ టాపిక్: రింగ్ లేకపోవడమేనా అసలు ట్విస్ట్?

కుటుంబ ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తలెత్తడంతో భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన–సింగర్ పలాష్ ముచ్చల్ వివాహ ఏర్పాట్లు అనూహ్యంగా ఆగిపోయాయి. పెళ్లి తేదీ దగ్గరపడుతున్న వేళ, స్మృతీ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ పరిణామం వెంటనే పలాష్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇద్దరి కుటుంబాలు సంప్రదింపులు జరిపి వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించాయి.

ఈ పరిస్థితుల్లో, సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్‌కు సంబంధించిన పాత వాట్సాప్ చాట్స్ అంటూ కొన్ని పోస్ట్‌లు వైరల్ కావడంతో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. వివాహ వాయిదా నిజానికి మరెందుకు జరిగిందన్న సందేహాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ఆరోపణలకు తెరదించినది పలాష్ సోదరి పలాక్ ముచ్చల్. స్మృతీ తండ్రి ఆరోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని, వాట్సాప్ చాట్స్ అసత్యమని ఆమె స్పష్టం చేసింది.

ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్మృతీ మంధాన సోషల్ మీడియాలో కొత్తగా కనిపించడం మళ్లీ చర్చలకు వేడి చేకూర్చింది. ఒక టూత్‌పేస్ట్ బ్రాండ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో స్మృతి చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించకపోవడం అభిమానుల్లో మరో అనుమానాలకు దారి తీసింది. అయితే ఆ ప్రకటనను నిశ్చితార్థానికి ముందే చిత్రీకరించినదని, వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి సంబంధిత పాత పోస్టులు తొలగించిందని ఆమెకు దగ్గర వర్గాలు చెబుతున్నాయి.

ఇరు కుటుంబాలు స్పష్టం చేసినట్టుగా–

“వాయిదా పూర్తిగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల వల్లే. పెళ్లి రద్దు కాదు, కొత్త తేదీ త్వరలో నిర్ణయిస్తాం.” పలాష్ తల్లి అమితా ముచ్చల్ కూడా త్వరలోనే వివాహ వేడుక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు ఆరోగ్యం మెరుగుపడే వరకు కొత్త ముహూర్తాన్ని నిర్ణయించకుండా వేచి చూస్తున్నాయి.

#SmritiMandhana #PalashMucchal #CelebrityWeddingUpdate
#WeddingPostponed #MandhanaNews #CricketStar
#PalashMucchalFamily #BollywoodMusic #SportsCelebs
#SocialMediaBuzz #CelebrityRumours #BreakingUpdate
#SmritiFans #PalashFans #IndianCelebrities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version