Andhra Pradesh
సుప్రీంకోర్టులో పెద్దారెడ్డికి ఊరట
తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
పెద్దారెడ్డి భద్రత కోసం పోలీసులు సెక్యూరిటీ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.