Andhra Pradesh
సుగాలి ప్రీతి కేసుపై పవన్ మాట మార్చారు: వైసీపీ నేత పోతిన మహేష్
వైసీపీ నేత పోతిన మహేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ అప్పట్లో ఒక మాట మాట్లాడితే, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పోతిన మహేష్ మాట్లాడుతూ— “సుగాలి ప్రీతి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగింది. జగన్ సీఎం అయిన తర్వాతే ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది. కానీ ఆ క్రెడిట్‌ను పవన్ తన ఖాతాలో వేసుకోవడం సరికాదు. నిజానికి ఈ కేసు ఎందుకు ఇంతకాలం తేలడం లేదు? విచారణను ఎవరు అడ్డుకుంటున్నారు? అనే విషయంపై పవన్ సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.