Andhra Pradesh

సాఫ్ట్‌వేర్ చదువు.. స్మగ్లింగ్ దారి: ‘పుష్ప’ను మించిన ప్లాన్‌తో గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్!

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక విద్యావంతుడు అక్రమ మార్గంలో కోట్లు సంపాదించాలనే ప్లాన్‌తో గంజాయి స్మగ్లింగ్‌కు తెరలేపాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ భారీ స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టయింది.ప్రధాన నిందితుడు హరిబాబు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. 2018లో తొలిసారి గంజాయి కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు, అక్కడ ఇతర స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక వారితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. గంజాయి తరలించడానికి ప్రత్యేకంగా బొలెరో వాహనాలను కొనుగోలు చేసి, వాటిలో ఎవరికీ కనిపించని విధంగా రహస్య అరలను నిర్మించాడు. పైన కూరగాయల లోడ్ ఉంచి, లోపల గంజాయిని దాచి పోలీసుల కళ్లు గప్పేవాడు.

నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఒడిశా నుంచి తమిళనాడులోని దిండిగల్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు,స్వాధీనం చేసుకున్న 160 కేజీల గంజాయి (విలువ సుమారు రూ. 1.19 కోట్లు), రెండు బొలెరోలు, ఒక కారు, బైక్ మరియు 9 సెల్‌ఫోన్లు, ఈ పద్ధతిలో ఇప్పటికే 12 సార్లు పోలీసులను బురిడీ కొట్టించి గంజాయి సరఫరా చేసినట్లు నిందితుడు అంగీకరించాడు,ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version