Telangana

రేవంత్ ప్రభుత్వం కీలక అడుగు.. నగరానికి మరో 20 కొత్త సబ్‌స్టేషన్లు.. ఇవే ప్రాంతాలు..!

గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు చేస్తోంది. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని చూస్తోంది. మార్చి నెల నాటికి 20 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లను నగరంలో ప్రారంభించాలని ప్రణాళిక చేసింది.

ఇళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువైతోంది. కాబట్టి డిస్కం అధికారులు ఒక ప్రత్యేక ప్లాన్ తయారు చేసారు. దీని ప్రకారం షాపూర్‌నగర్, అత్తాపూర్, సాయినగర్, భవానీనగర్ ప్రాంతాల్లో 7 సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నారు. అలాగే రంగారెడ్డి జోన్‌లోని మోకిల, కోహెడ, కొంగర కలాన్, మేడ్చల్ జోన్‌లోని బోడుప్పల్, మియాపూర్, శంబీపూర్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది.

ఇప్పటికే ముర్తుజాగూడ, షాపూర్‌నగర్ సబ్‌స్టేషన్లు విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల నిర్మాణం పూర్తయింది. భూగర్భ కేబుల్స్, స్విచ్ గియర్ అమరిక వంటి కీలక పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 31 నాటికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

హైదరాబాద్‌లో కొత్త సబ్‌స్టేషన్లు వస్తే, విద్యుత్ సరఫరాలో స్థిరత్వం పెరుగుతుంది. హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరిస్తోంది. కొత్త అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా విద్యుత్ వినియోగం 10 నుంచి 15 శాతం పెరుగుతోంది. గత వేసవి గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు డిస్కం అధికారులు చెప్పారు.

ఈ 20 కొత్త సబ్‌స్టేషన్లు ప్రారంభమైతే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనుంది.

#GreaterHyderabad #TGSPDCL #PowerSupply #NewSubstations #HyderabadElectricity#SummerActionPlan #33KVSubstation #PowerInfrastructure #HyderabadDevelopment#NoPowerCuts #ElectricityUpdate #TelanganaNews #UrbanGrowth #PowerBoost

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version