Andhra Pradesh
‘రావు బహదూర్’ పాత్రలో సత్యదేవ్.. ఫస్ట్ లుక్ చూశారా?
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ తన తదుపరి చిత్రంలో మరో విభిన్నమైన లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆయన, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో పూర్తిగా కొత్తగా కనిపించారు. “గుర్తుంచుకోండి… అనుమానం పెనుభూతం” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
సత్యదేవ్ పోషిస్తున్న పాత్ర గంభీరత, మిస్టరీ వాతావరణాన్ని సూచించేలా పోస్టర్ రూపకల్పన ఉంది. దర్శకుడు వెంకటేశ్ మహా తన ప్రత్యేకమైన కథనం, ప్రెజెంటేషన్ కోసం ప్రసిద్ధి చెందారు. ఈసారి కూడా ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచిన చిత్ర బృందం, త్వరలో టీజర్, ట్రైలర్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.