Education

మీ కళ్ల రంగు ఏంటి?

Eye Colour: కళ్ల రంగుకీ ఆరోగ్యానికి కనెక్షన్ ఎంటో తెలుసా? మీ కళ్లు చెప్పే  ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలని ఉందా? - Telugu News | What your Eye color  says about your health ...

ప్రపంచంలో కళ్ల రంగుల గణాంకాలు

ప్రపంచ జనాభాలో మెజారిటీగా గోదుమ రంగు కళ్లు కలిగిన వారే ఉన్నారు. తాజా అధ్యయనాల ప్రకారం సుమారు 70% నుంచి 79% వరకు మంది వ్యక్తులకు బ్రౌన్ (గోదుమ) కళ్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, అమెరికా మరియు యూరప్‌లో అధికంగా కనిపిస్తారు. గోదుమ రంగు కళ్లలో మెలనిన్ అధికంగా ఉండటం వల్ల సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇతర కళ్ల రంగుల ప్రత్యేకత

నీలి కళ్లు కలిగిన వారు ప్రపంచ జనాభాలో కేవలం 8% నుంచి 10% మాత్రమే ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. హజెల్ కళ్లు కలిగిన వారు సుమారు 5%, అంబర్ కళ్లున్న వారు మరో 5%, బూడిద రంగు కళ్లున్న వారు సుమారు 3% వరకు ఉన్నారు. ఇక ఆకుపచ్చ కళ్లు కలిగిన వారు అరుదుగా కనిపిస్తారు – వీరు ప్రపంచ జనాభాలో కేవలం 2% మాత్రమే ఉన్నారని చెబుతున్నారు.

అత్యంత అరుదైన కళ్ల రంగులు

ప్రపంచంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఎరుపు లేదా ఊదా (వయోలెట్) కళ్ల రంగు ఉంటుంది. ఇది సాధారణంగా ఆల్బినిజం ఉన్న వ్యక్తుల్లోనే కనిపించే ప్రత్యేకత. జన్యుపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు, మెలనిన్ స్థాయి ఆధారంగా కళ్ల రంగు మారుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అందుకే ఒకే కుటుంబంలో పుట్టిన వారిలో కూడా వేర్వేరు కళ్ల రంగులు కనిపించడం సహజమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version