Entertainment

ప్రభాస్ సైలెంట్ అనుకున్నా.. కానీ కాదు: మాళవిక

Malavika Mohanan cannot wait to romance Prabhas ప్రభాస్ తో వర్క్  చెయ్యడానికి ఎగ్జైట్ అవుతుంది

హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ను కలవకముందు ఆయన చాలా సైలెంట్, రిజర్వ్డ్ వ్యక్తిగా ఉంటారని తాను భావించానని, కానీ అది పూర్తిగా తప్పని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో జరిగిన చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ చాలా సరదాగా, ఉల్లాసంగా ఉంటారని, ఆయన సాంగత్యంలో ఎప్పుడూ బోర్ కొట్టదని పేర్కొన్నారు. ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా, సెట్స్‌లో అందరితో స్నేహపూర్వకంగా, హాయిగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటారని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం మాళవిక మోహనన్, ప్రభాస్‌తో కలిసి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మాళవిక వ్యాఖ్యలు ప్రభాస్ వ్యక్తిత్వంలోని సరదా, స్నేహపూర్వక కోణాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఈ సినిమా ద్వారా వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version