Andhra Pradesh

ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని

ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)కి కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో పాటు మూడు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏసీఏలో ఏకగ్రీవ ఎన్నికలు జరగడం విశేషంగా నిలిచింది.

తన ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని, ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి, ప్రతి జిల్లాలో క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల ఆటగాళ్లను తీర్చిదిద్దడం ఏసీఏ లక్ష్యమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. మూడేళ్ల పదవీకాలంలో ఆంధ్ర క్రికెట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లి, ప్రతిభావంతులైన యువతకు సరైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version