Andhra Pradesh

ఏపీకి మకుటాయమానం: రూ.1.35 లక్షల కోట్లతో భారీ స్టీల్‌ప్లాంట్.. మార్చి 7న భూమి పూజ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS) సంస్థ అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి మార్చి 7న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

 ఈ ప్లాంట్ కోసం సంస్థ సుమారు రూ.1.35 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది,భూ కేటాయింపు తొలి దశలో 2,200 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించనుంది. ఎకరాకు సుమారు రూ.51.39 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది,ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ఆర్సెలార్ మిట్టల్ నిర్ణయించింది. మొదటి దశ పురోగతిని బట్టి రెండో దశకు అవసరమైన భూసేకరణను ప్రభుత్వం చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక రాయితీలు మరియు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు నక్కపల్లి వద్ద భద్రతా ఏర్పాట్లు మరియు స్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version