Andhra Pradesh

ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan clarifies if he'll complete his pending films after becoming Deputy  CM: 'I asked filmmakers to forgive me…' - Hindustan Times

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. “ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగన్న ఈ ప్రాజెక్టు చివరికి సాకారమవుతోంది. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాక, రాజమండ్రి పౌరాణిక మహత్యానికి, సాంస్కృతిక వైభవానికి మరో కొత్త గుర్తింపు తీసుకొస్తుంది,” అని ఆయన అన్నారు.

రాజమండ్రి ప్రాంతం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్య వంటి మహానుభావులకు జన్మనిచ్చిన పవిత్ర భూమిగా గుర్తుచేస్తూ, ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 4 లక్షల మంది పర్యాటకులు అదనంగా రాష్ట్రానికి వచ్చే అవకాశముందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, పర్యాటక ప్రాంతాలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version