india news

ఇంధన యుద్ధం: ఉక్రెయిన్‌కు కరెంటు కట్ చేసిన స్లొవేకియా.. రష్యా ఆయిల్ కోసమేనా?

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాల మధ్య ‘ఇంధన యుద్ధం’గా మారింది. ఉక్రెయిన్ భూభాగం మీదుగా వచ్చే రష్యా ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో, స్లొవేకియా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌కు తాము అందిస్తున్న అత్యవసర విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

డ్రుజ్బా పైప్‌లైన్ సంక్షోభం,రష్యా నుంచి స్లొవేకియా, హంగేరీలకు చమురు సరఫరా చేసే ‘డ్రుజ్బా’ పైప్‌లైన్ జనవరి 27 నుండి నిలిచిపోయింది,రష్యా దాడుల వల్లే పైప్‌లైన్ దెబ్బతిందని ఉక్రెయిన్ అంటుంటే, ఉక్రెయిన్ కావాలనే సరఫరాను అడ్డుకుంటోందని స్లొవేకియాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి, చమురు సరఫరాను పునరుద్ధరించే వరకు ఉక్రెయిన్‌కు విద్యుత్ ఇచ్చే ప్రసక్తే లేదని స్లొవేకియా ప్రధాని తెగేసి చెప్పారు. అంతేకాదు, ఈ మొండివైఖరి కొనసాగితే ఐరోపా సమాఖ్య (EU)లో ఉక్రెయిన్ సభ్యత్వానికి తాము అడ్డుపడతామని కూడా హెచ్చరించారు.

ఒకవైపు రష్యా క్షిపణి దాడులతో ఇప్పటికే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. గడ్డకట్టే చలిలో స్లొవేకియా కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సామాన్య ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేసినప్పటికీ, స్లొవేకియా మాత్రం తన పట్టు వీడటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version