Latest Updates

అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ముఖ్యమంత్రిని నిలదీసిన భార్య.. సోషల్ మీడియాలో వైరల్!

ప్రజాస్వామ్య దేవాలయంలో బంధుత్వాల కంటే బాధ్యతలే గొప్పవని మేఘాలయ ముఖ్యమంత్రి దంపతులు చాటిచెప్పారు. మేఘాలయ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఆయన సతీమణి, ఎమ్మెల్యే మెహతాబ్ చందీ మధ్య జరిగిన చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గ్యాంబెగ్రే నియోజకవర్గ ప్రతినిధిగా మెహతాబ్ చందీ, ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పశుసంవర్ధక విద్యా ప్రాజెక్టుల జాప్యంపై ఆమె నేరుగా ముఖ్యమంత్రిని నిలదీశారు. 2022లో ఆమోదం పొందిన వెటర్నరీ, ఫిషరీస్ కళాశాలల పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి.దీనిపై ముఖ్యమంత్రి అత్యంత హుందాగా స్పందించారు. భూమి సేకరణ, డీపీఆర్ తయారీలో ఉన్న సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని వివరిస్తూ, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని భార్యకు (ఎమ్మెల్యేకు) హామీ ఇచ్చారు.

సాధారణంగా ఇంట్లో భార్యాభర్తలు అయినప్పటికీ, సభలో మాత్రం నిబద్ధత గల ప్రజాప్రతినిధులుగా వారు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగత బంధాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యలకే ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ ‘హెల్తీ డిబేట్’ రాజకీయాల్లో ఒక మంచి సంప్రదాయానికి నాంది పలికింది. సుమారు రూ. 334 కోట్ల ప్రాజెక్టు వివరాలను సీఎం సభ ముందు ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version