Latest Updates
బండి సంజయ్ టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంజయ్‌కు సన్నిహితుడైన ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు వెల్లడించారు.
సిట్ అధికారులు ఇటీవల ప్రవీణ్ రావుకు నోటీసులు జారీ చేసి, స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. 317 జీవో నిరసనలు, పదవ తరగతి పేపర్ లీక్, భైంసా అల్లర్ల సమయంలో ప్రవీణ్ రావు బండి సంజయ్‌కు అనుసరణగా ఉండటంతో అతని ఫోన్ ట్యాప్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత రాజకీయ సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.