Latest Updates
ఫోన్ ట్యాపింగ్ కేసు: సుప్రీంకోర్టుకు సిట్ మొగ్గు?
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినా, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం. దీంతో సిట్ అధికారులు ప్రభాకర్‌పై కస్టడీలో విచారణ చేయాలని భావిస్తున్నారు.
ఈ మేరకు సిట్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఆగస్టు 5 వరకు ప్రభాకర్‌ను అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ ఆదేశాలను రద్దు చేయాలని సిట్ కోర్టును అభ్యర్థించే అవకాశముంది. ఈ వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.