National
పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవందా రోడ్డుప్రమాదం తర్వాత 11 రోజులకే కన్నుమూత

పంజాబీ సినీ, సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచిన ఘటన ఇది. ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు రాజ్వీర్ జవందా అక్టోబర్ 8, 2025 (బుధవారం) ఉదయం 10:55 గంటలకు చండీగఢ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. గత 11 రోజులుగా అతను తీవ్ర పరిస్థితిలో చికిత్స పొందుతూ జీవన సహాయక పరికరాలపై ఉన్నాడు.
సెప్టెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో శిమ్లా వెళ్తుండగా రాజ్వీర్ జవందా ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతను తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. పైగా, ఆసుపత్రికి తరలించే సమయంలో కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చింది.
లుధియానా జిల్లా, జగ్రావోన్ తాలూకాలోని పొనా గ్రామానికి చెందిన రాజ్వీర్, తన “కాలి జవందే ది” పాటతో పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా “తూ దਿਸ్ పెందా”, “ఖుష్ రెహా కర్”, “సర్దారి”, “సర్నేమ్”, “అఫ్రీన్”, “ల్యాండ్‌లార్డ్”, “డౌన్ టూ ఎర్త్”, “కంగనీ” వంటి పాటలతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
కేవలం గాయకుడిగానే కాదు, నటుడిగా కూడా తన సత్తా చాటిన జవందా, 2018లో “సుభేదార్ జోగిందర్ సింగ్” (గిప్పీ గ్రెవాల్‌తో), 2019లో “జింద్ జాన్”, “మిందో తహసీల్దార్నీ” వంటి సినిమాల్లో నటించాడు.
అతని అసమయిక మరణం పంజాబీ పరిశ్రమకు తీరని లోటు. 35 ఏళ్ల వయసులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ప్రతిభావంతుడి ప్రయాణం ఇంతలోనే ముగిసిపోవడం ఎంతో దిగ్బ్రాంతికరం.