International
ఉక్రెయిన్ మొత్తం మాదే: పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఉక్రెయిన్ పై తన గట్టి స్థానం వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన, “రష్యన్లు, ఉక్రెయినియన్లు అన్నీ ఒకే కుటుంబం. ఆ దృష్టికోణంతో చూస్తే ఉక్రెయిన్ మొత్తం రష్యాదే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, రష్యా ఎప్పుడూ ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. “మేము చేస్తున్న పోరాటం మా భద్రత కోసమే. సుమీ ప్రాంతాన్ని కూడా మేం అధీనంలోకి తీసుకునే స్థితిలో ఉన్నాం. రష్యన్ సైనికుడు అడుగుపెట్టిన ప్రతి భూమి రష్యాదే అన్న సామెత applicable అవుతుంది” అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు.