Connect with us

International

ఇరాన్ ‘ప్లాస్టిక్’ దెబ్బ: అగ్రరాజ్యాల రాడార్లకు చిక్కని డ్రోన్లు.. తక్కువ ఖర్చుతోనే అమెరికాకు పెను విధ్వంసం!

#ఇరాన్_ఇజ్రాయెల్_యుద్ధం #డ్రోన్_వార్ #ప్లాస్టిక్_డ్రోన్లు #అమెరికా_ఇజ్రాయెల్ #షాహెద్136 #యుద్ధ_వ్యూహాలు #పశ్చిమాసియా #టెక్నాలజీ #భారత_రక్షణ_రంగం #అంతర్జాతీయవార్తలు #బ్రేకింగ్_న్యూస్ #సైనిక_వార్తలు

అమెరికా-ఇజ్రాయెల్ కూటమిపై ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో సాంకేతికత కంటే వ్యూహమే పైచేయి సాధిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఎంబసీలు, సౌదీలోని ఆయిల్ రిఫైనరీలపై జరిగిన దాడులు ఇరాన్ డ్రోన్ల శక్తిని చాటిచెప్పాయి.

సాధారణంగా క్షిపణులు లోహాలతో తయారవుతాయి కాబట్టి రాడార్లు వాటిని సులువుగా పసిగడతాయి. కానీ ఇరాన్ ‘కార్బన్ ఫైబర్ – ప్లాస్టిక్’ మిశ్రమంతో తయారు చేసిన షాహెద్-136 (Shahed-136) వంటి ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి రాడార్ సిగ్నల్స్‌ను ప్రతిబింబించవు, ఫలితంగా లక్ష్యానికి అతి దగ్గరకు వచ్చే వరకు వీటి ఉనికిని గుర్తించడం అసాధ్యం,ఒక్కో ఇరాన్ డ్రోన్ తయారీకి కేవలం 30 నుండి 40 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. కానీ వీటిని కూల్చడానికి అమెరికా ప్రయోగించే క్షిపణి విలువ దాదాపు 2 నుండి 4 మిలియన్ డాలర్లు. అంటే, ఆయుధాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా అమెరికాను ఇరాన్ దెబ్బకొడుతోంది.

వందలాది డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలను (Air Defense Systems) స్తంభింపజేయడం ఇరాన్ ప్రత్యేకత,ఇరాన్ ప్లాస్టిక్ డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా ఇప్పుడు ‘లుకాస్’ పేరుతో అదే తరహా డ్రోన్లను రంగంలోకి దించుతోంది. లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థలను కూడా అభివృద్ధి చేస్తోంది.ఇరాన్ డ్రోన్ల స్ఫూర్తితో భారత్ కూడా ‘శేషనాగ్-150’ వంటి అధునాతన ఆత్మాహుతి డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. గతంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో డ్రోన్ల ప్రాముఖ్యత ఇప్పటికే నిరూపితమైంది,సాంప్రదాయ యుద్ధ రీతులను మారుస్తూ, తక్కువ వ్యయంతో పెను విధ్వంసాన్ని సృష్టించే ఈ ‘డ్రోన్ వార్’ పశ్చిమాసియాలో పోరాట దిశను పూర్తిగా మార్చేస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *