International
సూడాన్‌లో ఘోరం – కొండచరియల విరిగిపాటు, గ్రామంలో 1,000 మందికిపైగా మృతి
![]()
ఆఫ్రికా దేశం సూడాన్‌లో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. డార్ఫర్ ప్రాంతంలోని మర్రా పర్వతాల వద్ద వరుస వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, సమీప గ్రామం పూర్తిగా మట్టికరిపినట్లు సమాచారం.
ఈ ఘటనలో 1,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సూడాన్ లిబరేషన్ మూమెంట్ ప్రకటించింది. ఒకే ఊరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది.
అత్యవసర సహాయం కోసం అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని సూడాన్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
![]()
