Telangana
వాహనదారులకు ఊరట: గూడ్స్ వాహనాల పన్ను విధానం కొత్త రూపంలో..!

తెలంగాణ ప్రభుత్వం గూడ్స్ వాహనాల పన్ను చెల్లింపులో మార్పులు చేయబోతోంది. వాహనం కొన్న వెంటనే జీవితకాల పన్ను వసూలు చేయడం కొత్త పద్ధతి. ఇప్పటివరకు మూడు నెలలకోసారి వసూలు అయ్యే పన్ను రద్దు అవుతుంది.
ప్రస్తుతం, చాలా వాహనాలు పన్ను చెల్లించడం లేదు. ఇది ప్రభుత్వ అధికారులు రోడ్లపై వాహనాలను ఆపి, పన్ను చెల్లించారా లేదా అని తనిఖీ చేయాల్సి వస్తుంది.
కొత్త నియమం ప్రకారం, వాహనం కొన్నప్పుడే పన్ను చెల్లించాలి. ప్రభుత్వం దీనివల్ల పన్ను ఎగవేత ఆగిపోతుందని భావిస్తోంది.
వాహనాలపై జీవితకాల పన్ను కొత్తగా కొనుగోలు చేసే సరుకు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పన్ను వాహన ధరలో 7.5 శాతం. పాత వాహనాలకు ఈ నియమం వర్తించదు. ఈ విధానం వల్ల వాహనదారులు ప్రతి మూడు నెలలకోసారి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, పెనాల్టీలు, అధికారుల ఆపు బాధ్యతలు కూడా తగ్గుతాయి.
గూడ్స్ వాహనాల సగటు వయసు సుమారు 15 సంతత్సరాలు. పాత విధానం ప్రకారం, ఈ కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పన్ను చెల్లించడం వాహనదారుల కోసం భారంగా మారింది. కొత్త విధానం అమల్లోకి రాకపోతో, భవిష్యత్తులో పన్ను వసూలు తక్కువగా అయినప్పటికీ, పన్ను ఎగవేతలకు శాశ్వతంగా అడ్డంకి ఏర్పడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు.
#Telangana #GoodsVehicleTax #LifetimeTax #TransportUpdate #TTDNews #VehicleOwners #TaxReform #RoadTransport #TelanganaGovt #VehicleRegistration #GoodsTransport #TaxPolicy #TransportNews #TaxCheck #VehicleTaxUpdate