Connect with us

Telangana

రేషన్ కార్డు లబ్ధిదారులకు హెచ్చరిక: 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి కాకపోతే రేషన్ నిలిపివేత!

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

ముఖ్యవార్త: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదు అయిన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అలా పూర్తికాకపోతే తదుపరి కాలంలో రేషన్ సరుకులు అందకపోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపిన ప్రకారం, డిసెంబర్ 31వ తేదీకి ఈకేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేయబడుతుంది మరియు రేషన్ కోటా రద్దు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల, రేషన్ కార్డు ఉన్నవారు వెంటనే సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి ఈపాస్ మిషన్ ద్వారా బయోమెట్రిక్ వేళిముద్రలను నమోదు చేసుకోవాలి.

కానీ కొంతమంది వింగర్ ప్రింట్‌లు నమోదు అవేలేదని సాంకేతిక సమస్యలను ఫిర్యాదు చేస్తూ వచ్చారు.

ఈకేవైసీ పూర్తి చేయకపోతే, ఉచిత రేషన్‌, పౌర సంక్షేమ పథకాల లబ్ధి భవిష్యత్తులో నిలిచిపోతుంది. పేదల కోసం అమలులో ఉన్న వాటిలోనూ ముఖ్యంగా, బియ్యం పంపిణీ, ఆరోగ్య పథకాలు, నగదు బదిలీ పథకాలలో లబ్ధి పొందడానికి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. చివరి గడువు దాటినా, ఎన్నో సందర్భాల్లో ఈకేవైసీ పూర్తి చేయించేందుకు.

#Telangana #RationCard #eKYC #TelanganaGovernment #RationAlert #PublicWelfare #LastDate #KYCUpdate #TelanganaNews #RationCardUpdate #CitizenAlert #TSRationCard

Loading