Andhra Pradesh
మద్యం ధరలపై మందుబాబు పాటల పోరు.. మంత్రి సోదరుడి విగ్రహం వద్ద వినూత్న రిక్వెస్ట్

నిషా మత్తు తలకెక్కితే మందుబాబుల విన్యాసాలు ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి రుజువైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ వ్యక్తి చేసిన విచిత్రమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఆ వ్యక్తి.. మద్యం ధరలు తగ్గించాలంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద మొరపెట్టుకున్నాడు.
అయితే ఇది సాధారణంగా కాదు. తనలోని భావ కవిని తట్టిలేపి.. పాట రూపంలోనే తన బాధను వినిపించాడు. “మద్యం ధరలు తగ్గించండి మహాప్రభో” అంటూ విగ్రహం ముందు నిలబడి పాట పాడుతూ వేడుకున్న తీరు అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియో వైరల్ అయినందున, నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఆందోళన చెందుతున్నారు. కొంతమంది నవ్వుతుంటే, మరికొందరు “మత్తులో ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది” అని వ్యంగ్యంగా అంటున్నారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వినోదంగా మారింది.
సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, జనవరి 9 నుండి 16 వరకు, రాష్ట్రంలో దాదాపు 877 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో 438 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైందని అధికారులు చెప్పారు.
పండగల సమయంలో ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. కొన్ని రకాల మద్యం మాత్రమే ధరల పెరుగుదలకు గురయ్యాయి. దీనిలో రూ.99 ధర గల లిక్కర్ బాటిళ్లు మాత్రం మినహాయించబడ్డాయి. అయితే, ప్రతి బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచారు. బీర్, వైన్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అన్ని ధరలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించినప్పటికీ, మద్యం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బార్ల యజమానులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. దీంతో వైన్ షాపులు, బార్లలో మద్యం ధరలు ఒకేలా ఉంటాయి. అయితే ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి సుమారు రూ.340 కోట్ల ఆదాయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇలా ఒకవైపు రికార్డు అమ్మకాలు.. మరోవైపు ధరలపై అసంతృప్తి.. మధ్యలో టెక్కలి మందుబాబు పాట.. ప్రస్తుతం ఏపీ మద్యం పాలసీపై చర్చకు దారితీస్తోంది.
#Srikakulam#Tekkali#ViralVideo#DrunkMan#FunnyIncident#LiquorPrices#AlcoholIssue#SocialMediaViral#NetizensReaction
#FunnyComments#APNews#AndhraPradesh#SankrantiSales#LiquorSales#ExciseDepartment#AlcoholPolicy#PublicReaction