Connect with us

International

పశ్చిమాసియా రణరంగం: రంగంలోకి చైనా.. శాంతి చర్చల కోసం బీజింగ్ రాయబారం!

#పశ్చిమాసియా_యుద్ధం #ఇరాన్_ఇజ్రాయెల్ #చైనా_మధ్యవర్తిత్వం #అంతర్జాతీయవార్తలు #శాంతిచర్చలు #నరేంద్రమోదీ #ఖమేనీ #గల్ఫ్_న్యూస్ #చమురుసంక్షోభం #ప్రపంచయుద్ధం #బ్రేకింగ్_న్యూస్ #దౌత్యనీతి

గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ యుద్ధ భయాలను పెంచుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్న తరుణంలో, ఈ వివాదాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని చైనా పిలుపునిచ్చింది.

చైనా వ్యూహాత్మక అడుగులు, యుద్ధాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధమని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల ప్రతినిధులతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక చర్చలు జరిపారు,శాంతి ప్రక్రియను వేగవంతం చేసేందుకు పశ్చిమాసియాకు ప్రత్యేక రాయబారిని పంపే యోచనలో బీజింగ్ ఉంది. దౌత్యం ద్వారానే జాతీయ భద్రతను కాపాడుకోవచ్చని గల్ఫ్ దేశాలకు చైనా భరోసా ఇచ్చింది,కేవలం సైనిక ఘర్షణలతో ఏ సమస్య పరిష్కారం కాదని, శాంతి చర్చలే శరణ్యమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని మోదీ సైతం అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని హితవు పలికారు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఆరో రోజుకు చేరింది. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా దళాలు సైప్రస్‌లోని బ్రిటన్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో నాటో (NATO) బలగాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు, అమెరికాకు చెందిన డేటా సెంటర్లు, ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల వల్ల చమురు సరఫరా స్తంభించిపోవడమే కాకుండా, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *