Andhra Pradesh
పనికిరాని వస్తువులు పారేయొద్దు.. తీసుకొస్తే నగదు చేతికే!
డిజిటలీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో పాడైపోయిన ఈ పరికరాల వల్ల ఏర్పడుతున్న ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్ర
పాడైన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యురీ వంటి విషపదార్థాలు నేలలో, నీటిలో కలిసిపోవడంతో తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రధాన నగరాల్లో ఏటా లక్షల టన్నుల మేర ఈ-వేస్ట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న అంచ
ఈ నేపధ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ, పునర్వినియోగానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఆర్‌ఈ సస్టెయిన్‌బిలిటీ – రెల్డన్ రిఫైనింగ్’ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అటువంటి భాగస్వామ్యంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దశలవారీగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏ
ఇలాంటి కేంద్రాల ద్వారా ఇళ్లు, దుకాణాల్లో, కార్యాలయాల్లో ఉపయోగం లేకుండా ఉన్న మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కేబుళ్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలను సేకరిస్తున్నారు. అనంతరం వీటిని పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ-వేస్ట్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత
The government, after starting this scheme on an experimental basis four months ago in 46 cities, has decided to extend the e-waste management in the jurisdiction of as many as 132 urban local bodies very shortly.
ఈ-వేస్ట్ ఇస్తే… డబ్బులు!
ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా సేకరణ కేంద్రాలకు ప్రజలు స్వయంగా ఈ-వ్యర్థాలను తీసుకొస్తే, వాటికి ధర నిర్ణయించి నగదు చెల్లించే విధానాన్ని పరిశీలిస్తోంది. ఇలా చేయడం వల్ల ఇళ్లు, షాపుల్లో ఉన్న పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు చెత్తగా మారకుండా సరైన మార
ఈ-వేస్ట్ సేకరణను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ తీసుకురావాలని ప్రభుత్వ యోచిస్తోంది. అందులో వ్యర్థాల వివరాలు నమోదు చేస్తే, సేకరణ కేంద్రాల సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి ఈ-వేస్ట్ తీసుకుని, నగదు చెల్లించే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి ఈ-వేస్ట్ సమస్యను అవకాశంగా మార్చి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు లాభం చేకూర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసిందని చెప్పవచ్చు.
![]()
