Health
నైట్ షిఫ్ట్ వర్కర్లకు డబుల్ రిస్క్!

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగస్తులు నైట్ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అయితే, వీరికి మిగిలిన వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉందని ఒక కీలక అధ్యయనం వెల్లడించింది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ నిర్వహించిన పరిశోధనలో 13 వేల మందిపై చేసిన విశ్లేషణలో ఈ విషయాలు బయటపడ్డాయి. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారికి హార్మోన్ల అసమతుల్యత, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇవే హృదయ సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయని అధ్యయనంలో తేలింది.
ఇలాంటి పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఎలా పాటించాలో పై వీడియోలో తెలుసుకోగలరు.
![]()
