Latest Updates
తెలంగాణలో కొత్త క్రీడా పాలసీకి రంగం సిద్ధం: జయేశ్ రంజన్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఉత్సాహాన్నిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త క్రీడా పాలసీని అమలులోకి తీసుకురానుందని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. ఈ పాలసీకి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశముందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే వేడుకల్లో జయేశ్ రంజన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీహరి, రాష్ట్ర క్రీడాధికార సంస్థ ఛైర్మన్ శివసేనారెడ్డి, పారా ఒలింపిక్ పతక విజేత దీప్తి జివాంజీ, విద్యార్థులు పాల్గొన్నారు. జయేశ్ రంజన్ వారితో కలిసి ఒలింపిక్ రన్లో పాతిలు కలిపారు
![]()
