Business
గూగుల్ ఫోన్ యాప్‌లో కొత్త డిజైన్

గూగుల్ తన ఫోన్ యాప్‌కి కొత్తగా Material 3 Expressive Redesignను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో చాలా మంది వినియోగదారులు గతంలో చూసిన కాల్ ఇంటర్‌ఫేస్ (Call Interface) కనిపించడం లేదని గమనించారు. కొత్త డిజైన్ వల్ల మొత్తం లుక్ మరింత ఆధునికంగా, స్పష్టంగా మారిందని గూగుల్ పేర్కొంది.
పాత డిజైన్‌పై వినియోగదారులు పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫోన్ జేబులో ఉండగా అనుకోకుండా కాల్‌కి ఆన్సర్ అవ్వడం లేదా డిక్లైన్ అవ్వడం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను నివారించేందుకు గూగుల్ కొత్త ఇంటర్‌ఫేస్‌ని తీసుకువచ్చింది. దీని వల్ల అనుకోని టచ్‌లు తగ్గి, ఫోన్ వినియోగం మరింత సులభతరం అవుతుందని చెబుతున్నారు.
అదనంగా, కొత్త అప్‌డేట్‌లో వినియోగదారులకు మరింత కంట్రోల్ ఇచ్చారు. Call Settings లోకి వెళ్లి, Incoming Call Gesture సెక్షన్‌లో Single Tap ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీంతో స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక ట్యాప్‌తోనే కాల్‌ని రిసీవ్ చేయడం లేదా డిక్లైన్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా పెద్ద వయసు ఉన్నవారికి, లేదా ఒక చేత్తో ఫోన్ వాడే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
![]()
