Connect with us

News

గల్ఫ్ యుద్ధం: తెలంగాణ వాసుల క్షేమంపై సర్కార్ భరోసా.. 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

#గల్ఫ్_వార్తలు #తెలంగాణ_ప్రభుత్వం #ఇరాన్_ఇజ్రాయెల్_యుద్ధం #రేవంత్_రెడ్డి #గల్ఫ్_కంట్రోల్_రూమ్ #అడ్లూరి_లక్ష్మణ్ #హైదరాబాద్_వార్తలు #జగిత్యాల #ప్రవాస_భారతీయులు #తెలంగాణ_బిడ్డలు #యుద్ధ_ఉద్రిక్తతలు #బ్రేకింగ్_న్యూస్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వేలాది మంది తెలంగాణ బిడ్డల పరిస్థితిపై ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల కుటుంబాలు భయపడాల్సిన పనిలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధైర్యం చెప్పారు. జగిత్యాల వంటి జిల్లాల నుంచి వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం మరియు రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బాధితుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని, అవసరమైతే రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మన వారిని సురక్షితంగా రప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మీ కుటుంబ సభ్యులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయి ఉంటే, ఈ క్రింది నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు:-తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్: 011-23380556,వందర బరువా (లైజన్ హెడ్): 9871999044,జి. రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): 9643723157,చక్రవర్తి (PRO): 9949351270,ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని, గల్ఫ్ దేశాల్లోని ప్రతి తెలంగాణ పౌరుడి రక్షణే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *