Andhra Pradesh
ఐటీ జాబ్స్ వరాలు… ప్రభుత్వం కొత్త పోర్టల్‌తో మరో అవకాశం తెరిచింది
కొత్త అవకాశాల ద్వారాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వేగంగా చర్యలు చేపట్టింది. ఐటీ, ఐటీ-ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఉద్యోగాలను కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘కౌశలం’ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది.
సర్వే రూపంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డేటా సేకరణలో ఇప్పటివరకు 24.14 లక్షల మంది యువత వివరాలు పోర్టల్‌లో నమోదయ్యాయి. ఇందులోని నైపుణ్యం, విద్యార్హతలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, టెక్ స్కిల్స్‌ను పరిశీలించి ఇప్పటికే సుమారు 2.5 లక్షల మందికి ఉద్యోగాలను అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన విజయం.
ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని మాట్లాడుతూ“ఈ పోర్టల్ పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువతను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించి, నేరుగా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాం.” అని చెప్పారు.
ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబయి వంటి ఐటీ హబ్‌లలో భారీ రోడ్‌షోలను నిర్వహించి ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత నైపుణ్యాలను కంపెనీల దృష్టిలో పెట్టే .ఇలాంటి ఈ ‘కౌశలం’ పోర్టల్‌ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యార్థుల విద్యార్హతలు, ప్రాజెక్ట్‌లు, స్కిల్స్ వంటి వివరాలు నేరుగా కంపెనీలకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన కూడా కొనసాగుతోంది. వచ్చే మూడు నెలల్లో ఈ పోర్టల్‌ను పూర్తి స్థాయిలో ప్రావర్తనలోకి తెచ్చే లక.
యువతకు ఉద్యోగమే కాక, ఇంటి నుంచే ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కూడా ఈ పోర్టల్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతున్న పరీక్షలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందడుగు, నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా మారుతోంది.
#APKoushalam #KoushalamPortal #APGovtJobs #ITJobsAP #YouthEmployment #SkillDevelopmentAP #ChandrababuNaidu #ITSectorJobs #APEmployment #APYouth #WorkFromHomeJobs #SkillMapping #APLatestNews #DigitalAP #AndhraPradeshDevelopment
![]()
