Andhra Pradesh
ఏపీలో విద్యార్థి సంక్షేమం.. దివ్యాంగుల సమస్యపై ప్రభుత్వ పరిష్కారం
ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. ఒక భాషా సబ్జెక్టు నుంచి ఇంటర్ మీడియట్ విద్యలో మినహాయింపు పొందిన దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తాజాగ
ఇంటర్మీడియట్‌లో ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు తో దివ్యాంగ విద్యార్థి ఇతర నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లుగా గుర్తింపును ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఉంతే ఉండటం వల్ల అయిదు సబ్జెక్టులు ఉత్తీర్ణులైన వారికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియలో
అయితే దివ్యాంగ విద్యార్థులు ఒక భాష సబ్జెక్టు నుంచి మినహాయింపు పొందినట్లయితే, వారు చదివిన మిగిలిన సబ్జెక్టుల్లో వచ్చిన సగటు మార్కులను ఆ మినహాయింపు సబ్జెక్టుకు కేటాయిస్తారు. ఈ విధానంతో వారు ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనట్లుగా అధికారికంగా మెమో జారీ చేయనున్నారు.
ఈ ఉత్తర్వులతో రాబోయే కాలంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, మరియు ఇతర కేంద్ర విద్యాసంస్థల ప్రవేశాల సమయంలో దివ్యాంగ విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారులు తెలిపారు. గత రెండేళ్లుగా ఈ సమస్యపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ అవుతున్నప్పటికీ, తాజా జీవోతో దీనికి శాశ్వత పరిష్కారం లభించినట్లు ప్రభుత్వం స్పష్టం చేస
ఈ ఏడాది కూడా కొందరు దివ్యాంగ విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ సమయంలో సమస్యను ఎదుర్కొనగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తమ ఇబ్బందులను తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, అధికారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. విద్యార్థులతో నేరుగా సమావేశమై హామీ ఇచ్చినట్లుగానే,
తుదినిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. చదువులో ప్రతిభ ఉంటున్నా నిబంధనల కారణంగా అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద భరోసాగా మారింది.
#APGovt#DisabledStudents#InterStudents#IITAdmissions#NITAdmissions#EducationReforms#InclusiveEducation#StudentWelfare
#APEducation#EqualOpportunities#DivyangStudents#TeluguEducationNews
![]()
