Andhra Pradesh
ఏడాది పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగతి నివేదిక విడుదల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఏడాదిలో తాను అధిగమించిన శాఖలలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈ నివేదికలో ప్రజలతో పంచుకున్నారు.
ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో ఈ నివేదికను తీసుకువచ్చామని పవన్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ప్రజల అభివృద్ధికి కట్టుబడి, బాధ్యతతో పనిచేస్తానని ఆయన ట్విట్టర్ (X) వేదికగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ దశలో తాను చూపుతున్న పాలనారీతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
![]()
