Latest Updates
ఏంటీ డ్రైవింగ్.. గూస్బంప్స్ పక్కా!
![]()
లద్దాక్‌లోని అత్యంత ప్రమాదకరమైన డుబ్రూక్–డౌలత్ బేగ్ ఓల్డీ (DBO) రోడ్డులో ఓ లారీ డ్రైవర్ చూపిన సాహసం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రదేశం ఆఫ్‌రోడింగ్‌కు చక్కటి స్థలం అయినా, అక్కడ భారీ వాహనాలను నడిపించడం అసాధ్యమైన పనిగా చెప్పవచ్చు.
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో లారీ సగం నీటిలో మునిగిపోయింది. ఇక రోడ్డు దాదాపు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో కూడా డ్రైవర్ మాత్రం వెనక్కి తగ్గకుండా లారీని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ సాహసోపేతమైన డ్రైవింగ్‌కు నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
![]()
