Telangana
మూసీ నది పునరుద్ధరణకు సీఎం ఆమోదం.. తొలి దశలో 21 కి.మీ పనులు త్వరలో ప్రారంభం!

మూసీ నది పునరుద్ధరణ అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గుజరాత్‌లోని సబర్మతి, గంగా, యమునా నదుల పునరుద్ధరణ ప్రాజెక్టులను ఉదాహరణలుగా ప్రస్తావించారు.
మూసీ నది పునరుద్ధరణ చాలా అవసరమని ఆయన తెలిపారు. మొదటి దశలో మార్చి 31వ తేదీలోగా 21 కిలోమీటర్ల మేర ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు.
అంతేకాక, 51 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా నిర్మించనున్నారు అని సీఎం వివరించారు. సంక్రాంతి వేళలో ప్రాజెక్ట్ డీపీఆర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా, గండిపేట, హిమాయత్‌సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు తొలి దశలో ముసీ నది అభివృద్ధి చేస్తామని, నాబార్డ్ ద్వారా తీసుకున్న రూ.4,100 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అలాగే, మీర్ ఆలం ట్యాంక్‌పై రూ.450 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి జలవనరులను కలుషితం చేసిన వారిపై, కబ్జా చేసిన వారిపై, ఫామ్ హౌస్‌లు నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జంట జలాశయాలకు డ్రైనేజీ సిస్టమ్‌లను కలిపామని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసీ నది మొత్తం 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని, అనంతగిరి హిల్స్ నుండి వాడపల్లి వరకు ప్రప్రవాహం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ముసీ, ఈసీ నదులు కలిసే ప్రాంతంలో బాపుఘాట్ నిర్మించి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టనుందని తెలిపారు.
#MusheeRiver #TelanganaNews #RiverRejuvenation #MoosiProject #RevanthReddy #TelanganaAssembly #WaterConservation #TelanganaDevelopment #FloodPrevention #EnvironmentalProjects #NalaCleaning #InfrastructureDevelopment #TelanganaUpdates #WaterResources