Telangana

పెంపుడు కుక్కను ‘అందుకోసం’ బయటకు తీసుకెళ్తున్నారా? అయితే జరిమానా చెల్లించాల్సిందే.

పెంపుడు కుక్కను ‘అందుకోసం’ బయటకు తీసుకెళ్తున్నారా? అయితే జరిమానా చెల్లించాల్సిందే.

పెంపుడు కుక్కను రోడ్డు మీద వదిలి, అక్కడ మలవిసర్జన చేస్తే, ఆ కుక్క యజమాని జరిమానా చెల్లించాల్సిందే. ఈ క్రమంలో మున్సిపల్ చట్టంలో ఉన్న ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.

చాలా మంది జంతు ప్రేమికులు కుక్కలను పెంచుకుంటారు. వాటి ఆలనా పాలనా దగ్గరుండి చూసుకుంటారు. కొందరు పెట్ లవర్స్.. తమ కుక్కలను మల విసర్జన చేయించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిని బయటకు తీసుకెళ్తుంటారు. అలా వీధుల్లో రెండు లేదా మూడు రౌండ్లు తిరిగిన తర్వాత కుక్కలు మల విసర్జన చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతాలు అపరిశుభ్రంగా మారిపోతాయని తెలుసుకున్నప్పటికీ, కొందరు యజమానులు అవేమీ పట్టకుండా తమ పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం బయటకి తీసుకెళ్తుంటారు.

ఇతరపై పెంపుడు కుక్కలు బయట మలవిసర్జన చేస్తే, వాటి యజమానులు జరిమానా చెల్లించాల్సిందే. ఈ క్రమంలో మున్సిపల్ యాక్ట్‌లో ఉన్న నియమాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు మరియు స్థానిక సంస్థల్లో కఠినంగా అమలు చేయనున్నారు. ఈ విషయంలో మున్సిపల్ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆ జిల్లాల కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ నియమం ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో అమలులో ఉంది. చాలా పట్టణాల్లో కుక్కల మలవిసర్జన కూడా పరిసరాల అపరిశుభ్రతకు కారణమని అధికారులు గుర్తించారు. వీధి కుక్కల గురించి పక్కనపెడితే, పెంపుడు కుక్కల విషయంలో వాటి యజమానులు జాగ్రత్తగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా, మున్సిపల్‌ శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాల ప్రకారం, పెంపుడు కుక్క వీధిలో మలవిసర్జన చేస్తే, దాని యజమానికి మున్సిపల్ అధికారులు రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ జరిమానా ఒకే విధంగా కాకుండా, ప్రతి మున్సిపాలిటికి అనుసారంగా మారుతుంటుంది. ఎవరైనా తమ పెంపుడు కుక్కలను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలేస్తే, అవి అక్కడ మలవిసర్జన చేస్తే, వాటి యజమానులు ఆ మలాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే, వారికి మున్సిపల్ అధికారులు రూ.వెయ్యి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను గమనించి, పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version