Telangana

ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్.. ఇదెక్కడి విచిత్రం..

ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, స్టేషన్ చుట్టూ తిప్పే ఘటనలు తరచుగా చూస్తుంటాం. కానీ, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు కొంతమేరకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఏకంగా ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

నర్సాపూర్‌లో భూమి వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరుగగా, నర్సాపూర్ పోలీసులు ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌లో పాతులోత్ విఠల్ అనే వ్యక్తి పేరు కూడా చేర్చబడింది. అయితే ఈ విషయం విచిత్రమైంది ఎందుకంటే విఠల్ వ్యక్తి ఏడేళ్ల క్రితం మరణించాడు.

ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశ్చర్యంలో పడిపోయారు. చనిపోయిన వ్యక్తి పేరుపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఠల్ కుటుంబ సభ్యులు, తమ భూవివాదంలో ప్రత్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మృతుడి ఫోటో మరియు మరణ ధ్రువీకరణ పత్రం చూపించినప్పటికీ, పోలీసులు తమ అనుచిత చర్యలను ప్రశ్నిస్తున్నారు.  “ఎందుకు పోలీసులు మా మీద అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారు?” అని వారు వాపోతున్నారు.  ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version