Entertainment

IND vs PAK మ్యాచ్‌పై భారత అభిమానుల నిరాసక్తత?

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే.. లిస్ట్ చూస్తే  పరేషాన్ అవ్వొద్దు భయ్యో..

సాధారణంగా ఇండియా–పాకిస్థాన్ పోరు అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండుగే. ఎక్కడ జరిగినా టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి. స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విభిన్నంగా మారింది. సెప్టెంబర్ 14న UAEలో జరగబోతున్న ఆసియా కప్ పోరుకు కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నా టికెట్ సేల్ సరిగ్గా జరగడం లేదు. క్రికెట్ అభిమానుల ఆసక్తి తగ్గిందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాయాదుల పోరుకు డిమాండ్ ఎందుకు తగ్గిందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారతీయుల్లో పాకిస్తాన్‌పై వ్యతిరేకత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ చూడాలని ఆసక్తి చూపడం లేదని వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ మ్యాచ్‌ను మిస్ కాకూడదనుకునే అభిమానులు ఈసారి మాత్రం వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది.

అయితే మరోవైపు నిపుణులు మాత్రం పరిస్థితిని వేరే కోణంలో విశ్లేషిస్తున్నారు. UAEలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు భారతీయ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రయాణం చేయడం కష్టమవుతుందని అంటున్నారు. పాకిస్తాన్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, భారతీయులు పెద్దగా రాకపోవడంతో స్టేడియం హాఫ్ ఫిల్ అవుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా IND vs PAK పోరుకు సాధారణంగా ఉండే “హాట్ కేక్ క్రేజ్” ఈసారి కనిపించకపోవడం నిర్వాహకులకు షాక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version