Andhra Pradesh

హైదరాబాద్-విశాఖ ప్రయాణం సులభం.. విజయవాడ సర్కిల్ దాటకుండా, 125 కి.మీ, 5 గంటల ఆదా!

పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న యాక్సిస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి వస్తుంది. వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుండి తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు విస్తరించబోతోంది. కోర్టు వివాదాలు పరిష్కరించబడినందున పనులు వేగంగా జరుగుతున్నాయి.

హైవే పూర్తయితే, హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు ప్రయాణం చేయడానికి దూరం సుమారు 125 కిలోమీటర్లు తగ్గుతుంది. అంటే మనం హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు ప్రయాణం చేయడానికి మనకు ఇప్పుడు 12 గంటలు పడుతుంది కానీ హైవే పూర్తయితే మనకు 5 గంటలు మాత్రమే పడుతుంది. ఈ ప్రాజెక్టు 162 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 4,609 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు.

ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, స్థానికులు, ప్రయాణికులు, రవాణా రంగానికి ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల భూమి వివాదాల కారణంగా మిగిలిన కొన్ని పనులు ఆగిపోయినప్పటికీ, ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయి చివరి రెండు కిలోమీటర్లు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ హైవే అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్-విశాఖపట్నం మధ్య రవాణా వేగం పెరుగుతూ, సమయం మరియు ఇంధన ఖర్చు ఆదా అవుతుంది, ప్రయాణీకులకు పెద్ద ఊపుదనం లభిస్తుంది.

#HighwayUpdate#TelanganaRoads#TravelTimeSave#RoadInfrastructure#NH365#HighwayConstruction#HighwayOpening#TeluguNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version