Latest Updates

హైకోర్టులో కాళేశ్వరం పిటిషన్ వాదనలు ప్రారంభం

TG High Court: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కీలక పరిణామం |  Kaleshwaram Project Corruption KCr Harish rao Petition Telangana High court  Suchi

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇటీవల కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (KCR) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా KCR తరఫున లాయర్ కోర్టుకు సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఆయన వాదనలో నివేదిక తయారీ పూర్తిగా రాజకీయ ప్రేరణతోనే జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తీసుకువెళ్లారని స్పష్టం చేశారు.

నివేదికపై తీవ్ర అభ్యంతరాలు
నివేదిక కాపీలను ముందుగా పిటిషనర్‌కు ఇవ్వకుండా నేరుగా మీడియాకు విడుదల చేయడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని KCR తరఫు లాయర్ వాదించారు. ఇది సహజ న్యాయానికి విరుద్ధమని, కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, నివేదికలో ఉన్న కొన్ని అంశాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, అవి ప్రజల్లో తప్పుదోవ పట్టించేలా ప్రదర్శించబడినట్లు లాయర్ ఆరోపించారు.

మేడిగడ్డ కుంగిన ఘటనపై వివరణ
మేడిగడ్డలో పిలర్స్ కుంగిపోయిన ఘటనపై కూడా KCR లాయర్ స్పందించారు. ఆయన వాదన ప్రకారం, అకాల వర్షాలు, వరదల కారణంగానే మేడిగడ్డలో సమస్య తలెత్తిందని, దీన్ని డిజైన్ లేదా ఇంజనీరింగ్ లోపాలతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో కమిషన్ నివేదికను రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని కోర్టును కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version