Job Alerts

సింగరేణి అప్రెంటీస్ అవకాశాలు: కొత్త నోటిఫికేషన్ విడుదల… వెంటనే దరఖాస్తులు సమర్పించండి!

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025 సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తూ, వివిధ ట్రేడ్లలో స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ 95% రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. మిగతా 5% సీట్లను స్థానికేతర అభ్యర్థులకు కేటాయించనున్నారు.

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్–రూరల్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్థానికులుగా పరిగణించబడతారు.

ఎంపిక పూర్తిగా సీనియారిటీ ఆధారంగా జరగనుంది. ఒకే సంవత్సరం ఉత్తీర్ణులైన అభ్యర్థుల విషయంలో మార్కుల ఆధారంగా సీట్ కేటాయింపు ఉంటుంది. తుది మెరిట్‌ లిస్టును ప్రత్యేక కమిటీ సిద్ధం చేసి, SCCL అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.

నేర్చుకుందాం అప్రెంటిస్‌షిప్ అందించే ట్రేడ్లు

ఎలక్ట్రీషియన్

ఫిట్టర్.

టర్నర్

మిషనిస్టు

మెకానిక్ (మోటార్ వెహికిల్)

డ్రాఫ్ట్స్‌మెన్

డీజిల్ మెకానిక్

వెల్డర్

Stipend details:

ఐటీఐ రెండేళ్ల కోర్స్ చేసిన అభ్యర్థులు :

నెలకు ₹8,050

ఒక సంవత్సరం ఐటీఐ పూర్తిచేసిన డీజిల్ మెకానిక్ & వెల్డర్లు:

₹7,700 per month

దరఖాస్తు విధానము :

**ముందుగా www.apprenticeshipindia.orgలో
రిజిస్ట్రేషన్ చేయాలి

ఆపై scclmines.com వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు అప్‌లోడ్ చేయాలి

ఆన్‌లైన్ అప్లికేషన్ కాపీతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు

(విద్యార్హత, కుల ధృవీకరణ, ఆధార్)

డిసెంబర్ 8–25, 2025 మధ్య సమీపంలోని MVTC సెంటర్‌లో సమర్పించాలి. అర్హతలు : వయసు: 18–28 సంవత్సరాలు రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్టం 33 సంవత్సరాలు. సింగరేణి మండలి ప్రాంతాల యువతకు ఈ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగావకాశాలకు దారితీసే కీలక మెట్టుగా నిలుస్తుంది.

#SCCL #SingareniJobs #Apprenticeship2025 #SingareniNotification #TelanganaJobs #ITIJobs #GovtJobs #TechnicalTraining #SingareniApprentice #SCCLRecruitment #MVTC #JobNotification #SkillDevelopment #YouthOpportunities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version