News

వనభూమిలో నేడు రేవంత్ రెడ్డి టూర్… ఆయన రాకకు నేపథ్యం దాగి ఉందా?

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.260 కోట్లు 45 లక్షల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పలు నిర్మాణాలు, ప్రజా సదుపాయాల ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేతుల మీదుగా జరగనున్నాయి.

ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ చేరుకుని సమావేశ స్థలాన్ని పరిశీలిస్తూ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రభుత్వ సేవలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఆదిలాబాద్‌పై ప్రత్యేకమైన అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి, ఈ విజయోత్సవాలలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఈ పట్టణాన్ని ఎంపిక చేసుకున్నారు. భారీ బహిరంగ సభకు హాజరుకాకముందు, నగరంలోని పలు అభివృద్ధి పనులకు పునాదిపూజ చేయనున్నారు.

#CMRevanthReddy #Adilabad #PrapaPalana #Vijayotsavalu #TelanganaCM #AdilabadDevelopment #RevanthReddyTour #PublicMeeting #IndiraPriyadarshiniStadium #TelanganaGovernance #DevelopmentWorks #PanchayatElections #TelanganaNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version