Latest Updates

ఛాన్స్ రాకపోవడంతో బాధపడ్డ అభిమన్యు!

Abhimanyu Easwaran's private chat with Gautam Gambhir leaked: 'I will not  push you...'

భారత క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్‌కు ఇంగ్లాండ్ పర్యటనలో నిరాశ ఎదురైంది. టెస్టు సిరీస్ కోసం జట్టుతో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పటికీ, తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై అతని తండ్రి రంగనాథన్ స్పందిస్తూ, “నేను ఫోన్ చేసినప్పుడు అభిమన్యు చాలా బాధగా మాట్లాడాడు. తుది జట్టులో తన పేరు లేకపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు” అన్నారు.

అయితే, ఈ నిరాశను ఎదుర్కొంటూ అభిమన్యు తన కలపై విశ్వాసం కోల్పోలేదని రంగనాథన్ వెల్లడించారు. “ఇది తన 23 ఏళ్ల కల. ఒకటి రెండు మ్యాచ్‌లకు ఎంపిక కాకపోవడం వల్ల ఆ కల చెదిరిపోదు. తన కృషి కొనసాగిస్తే తప్పకుండా అవకాశం వస్తుందని అతను నమ్ముతున్నాడు” అని తండ్రి వివరించారు.

రంగనాథన్ మాటల్లో, కోచ్ గౌతం గంభీర్ కూడా అభిమన్యుకు ధైర్యం చెప్పారని తెలుస్తోంది. “చాన్స్ తప్పకుండా వస్తుంది” అని గంభీర్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం అభిమన్యు, భవిష్యత్తులో తన ఆటతీరుతో జట్టులో స్థానం సంపాదించాలని దృష్టి సారించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version