Latest Updates

క్రిస్మస్–న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో మోసగాళ్ల వల… క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

సంవత్సరాంత వేడుకల సందడి మొదలైన నేపథ్యంలో సైబర్ దందేబాజులు తమ ఉచ్చు విస్తరించడం మొదలుపెట్టారు. క్రిస్మస్, నూతన సంవత్సర ఆనందాల్లో ప్రజలు తలమునకలై ఉండడాన్ని ఆసరాగా తీసుకుని, పండుగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, లక్కీ డ్రాల పేరుతో ఆకర్షణీయమైన మెసేజ్‌లను వాట్సాప్‌-ఈమెయిల్స్‌కు వరుసగా పంపుతున్నారు. బయటకు చూస్తే ఇవి నమ్మదగ్గ ఆఫర్లలా కనిపించినా… వాటిల్లో దాగిన లింక్‌పై క్లిక్ చేసిన క్షణం నుంచి సమస్యలు మొదలవుతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో తక్కువ ధరలకు విమాన-బస్సు టిక్కెట్లు ఇస్తామని చెప్పే నకిలీ ట్రావెల్ వెబ్‌సైట్లు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ వంటి నగరాల నుంచి ప్రయాణించే వారిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ, అనవరసమైన ఆఫర్లతో మోసగాళ్లు తమ మాయాజాలం నడుపుతున్నారు.

అదే విధంగా పేరొందిన ఈ-కామర్స్ కంపెనీల రూపాన్ని పోలిన నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు కూడా విపరీతంగా పెరిగాయి. పదివేల రూపాయల విలువ ఉన్న ఉత్పత్తిని వెయ్యి రూపాయలకు ఇస్తామని చెప్పి వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఆ వస్తువును కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ వివరాలు నేరగాళ్లకు చేరగానే… ఖాతాలోని మొత్తమంతా కళ్లెం కాలినంత వేగంగా మాయం అవుతుంది.

లక్కీ డ్రాలో గెలిచారు, ప్రత్యేక గిఫ్ట్ దక్కింది, క్రిస్మస్ బంపర్ రివార్డ్ వచ్చిందంటూ పంపే మెసేజ్‌లు చాలా ప్రమాదకరం. ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్‌లో హానికరమైన మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీంతో ఫోన్‌లోని ఫోటోలు, కాంటాక్ట్‌లు, ఓటిపిలు, పర్సనల్ సమాచారం మొత్తం సైబర్ క్రిమినల్స్ చేతిలో పడుతుంది.

పండుగ సమయంలో ఉచిత బహుమతులు లేదా భారీ డిస్కౌంట్‌లు వస్తే ఏవరికైనా ఆకర్షణే. ఇదే మనుషుల బలహీనతను సైబర్ దొంగలు లాభంగా మార్చుకుంటున్నారు. ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి:

  • గుర్తు తెలియని వాట్సాప్/ఈమెయిల్ లింక్‌లను తెరవకండి

  • ఆఫర్ నిజమా కాదా తెలుసుకోవాలంటే సంబంధిత కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే చెక్ చేయండి

  • URL లో ‘https://’ ఉందా చూడండి

  • స్పెల్లింగ్ తప్పులు ఉన్న వెబ్‌సైట్‌లను వెంటనే వదిలేయండి

  • వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా, ఓటిపిలను ఎవరికీ పంచుకోకండి

ఒకవేళ ఎలాంటి మోసానికి గురయ్యారు అనిపించినా… ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. మొదటి ఒక గంటలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు గణనీయంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

#CyberSafety#OnlineFraudAlert#FestiveSeasonScams#CyberCrimePrevention#StaySafeOnline#WhatsAppScamAlert#EmailFraud
#FakeOffers#FraudAwareness#DigitalSafety#CyberSecurityTips#NewYearAlert#ChristmasScam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version