Telangana
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో భారీ షాక్.. 33 లక్షల మందికి ఇల్లు రద్దు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. పేదలకు ఇళ్లు అందించడం లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం అర్హుల ఎంపికలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. ఇందు గా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 32.98 లక్షల మందికి ఇళ్లు రద్దు చేసే అవకాశముందని సమాచారం అందింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్ల చొప్పున మొత్తం 9 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉితోచింది. ఈ పథకం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 77.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఇంటింటి సర్వే చేసి అర్హతల ఆధారంగా ప్రభుత్వం మూడు విభాగాలుగా కేటాయించింది.
👉 ఎల్–1 జాబితాలో సొంత ఇల్లు లేదా సొంత స్థలం లేని అత్యంత నిరూపేదులను చేర్చారు. ఈ కేటగిరీలో 23.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రెండు సంవత్సరాల్లో 13.50 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన వారికి తరువాతి దశల్లో అవకాశం ఇవ్వనున్నారు.
👉 ఎల్–2 జాబితాలో ఇల్లు మరియు స్థలం లేని నిరుపేదలు ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 21.49 లక్షలు. ఈ వర్గానికి ఇంటి స్థలంతో రూ.5 లక్షల నిర్మాణ సహాయం ఇవ్వాలా? లేదా బ్లాక్‌ల వారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి.
👉 ఎల్–3 జాబితాలో ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే సొంత ఇల్లు ఉన్న వ్యక్తులు ఉన్నారు. వీరిని అనర్హులుగా గుర్తించారు. ఈ జాబితాలో 32.98 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సంపూర్ణంగా నిజమైన నిరుపేదలకే లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. పారదర్శకత మరియు అర్హతే ముఖ్యమైన ప్రమాణంగా భావిస్తూ కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనర్హులకు షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ మరియు సామాజిక చర్చకు దారితీస్తోంది.
#IndirammaHousingScheme#TelanganaHousing#HousingForPoor#GovernmentSchemes#TelanganaNews#BreakingNews#BigShock
#PolicyDecision#PublicWelfare#HousingCrisis#SchemeUpdate#TelanganaGovernment#SocialJustice#PoorPeopleIssues#LatestNews