Latest Updates
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల
హైదరాబాద్ మరియు రంగారెడ్డి (RR) జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్యలో పెరుగుదల జరుగనుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14, హైదరాబాద్‌లో 15 నియోజకవర్గాలు ఉండగా, తాజా ప్రణాళిక ప్రకారం రంగారెడ్డిలో 9, హైదరాబాద్‌లో 2 నియోజకవర్గాలు పెంచనున్నారు. దీంతో రెండు జిల్లాల్లో కలిపి నియోజకవర్గాల మొత్తం సంఖ్య 40కి చేరనుంది.
ఈ విభజనకు జనాభా లెక్కలు ఆధారంగా చేపట్టనున్నారు. 2027 మార్చి నాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. అదే ఏడాది చివరలో కొత్త నియోజకవర్గాలను అధికారికంగా అమలు చేసే అవకాశం ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గానికి సగటున 2,30,064 జనాభా కేటాయింపుతో డిలిమిటేషన్ చేపట్టనున్నారు. అయితే ±10% వ్యత్యాసం ఉండే అవకాశముంది.